యాంకర్ కు కోటి రూపాయలా?

anchor-anasuya
తన హాట్ అందాలు, మాటలతో కవ్వించే యాంకర్ అనసూయ గుర్తుందా! సాక్షి టీవీలో పనిచేసి, ఆ తర్వాత మాటీవీ, ఈటీవీలో కొన్నాళ్లు జబర్థస్త్ యాంకర్ గా పనిచేసింది ఈ పోరీ. తాజాగా తన చిత్రంలో నటించేందుకు ఒక నిర్మాత కోటి రూపాయల పారితోషికం అందిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఏడాది క్రితం పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అనసూయను సంప్రదించారని, అయితే ఐటం సాంగ్స్ చేయనని ఆమె ఆ  ఆఫర్ ను తిరస్కరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇద్దరు పిల్లలు తల్లి అయినా అనసూయను ఇష్టపడే అభిమానులెందరో ఉన్నారు.  తాజాగా అనసూయకు హీరోయిన్ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకోసం సదరు నిర్మాత ఆమెకు కోటి రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దం అయినట్లు... అయితే అందుకు ఆ నిర్మాత అనసూయని మూడు నెలల డేట్స్ అడిగినట్లు తెలుస్తోంది.  అయితే ఈ ఆఫర్ పై అనసూయ మాత్రం పెదవి విప్పటం లేదు. బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పించిన అనసూయ వెండితెరపై రాణిస్తుందా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment