ఆంధ్రప్రదేశ్ కు తరలిపోనున్న ౩ వేల కంపెనీలు


andhrapradesh-newcompanies
కేసీఆర్ తెలంగాణకు.. అందులోనూ హైదరాబాద్ కు ఎంత బ్రాండ్ ఇమేజ్ తేవాలని కలలు కంటున్నా అవి వర్క అవుట్ అయ్యేటట్లు లేవని సమాచారం. గత వారం హైదరాబాద్ కొచ్చిన 14వ ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించిందని ఒక టాక్ వినిపిస్తోంది!  తెలంగాణ- ఆంధ్ర రాష్ర్టాలుగా విడిపోయిన తర్వాత దాదాపు మూడువేల మంది పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు కన్నేసినట్టు ఆ నివేదికలో తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిందట. ఇదే కంటిన్యూ అయితే రాబోయే సంవత్సరాల్లో తెలంగాణ రాష్ర్ట పన్ను వసూళ్లు పడిపోయే ప్రమాదముందని ఆదుర్దా వ్యక్తం చేసిందట. ఈ నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు కేంద్రం కల్పిస్తున్న రాయితీలను తమకూ ఇవ్వాలని అందులో వెల్లడించింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ కంపెనీల్లో ఎక్కువ శాతం ఆంధ్ర, రాయలసీమ మూలాలున్న వ్యక్తులవే కావడం.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment