అనుష్కకు తారామతి.. బారాదరిలో ఏం పని?

anushka-taramathi-baradari
అనుష్క బాహుబలి తర్వాత పెళ్లి చేసుకోనుందని వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె పర్సనల్ మేనేజర్ తెలిపాడు. "ఓ యంగ్ డైరెక్టర్ వినిపించిన స్టోరీ ఆమెకి బాగా నచ్చింది. కానీ ఇప్పటికే ఆమె చేతిలో బాహుబలి, లింగా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కనున్న మరో సినిమాలున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక 'తారామతి బారాదరి' పాత్ర నేపథ్యంలో ఇంకో హిస్టారికల్ మూవీ చేయాల్సి వుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అంటే ఇప్పుడామె చేతిలో మొత్తం నాలుగు సినిమాలున్నాయి. అందుకే ఆమె మరే ఇతర కొత్త ప్రాజెక్ట్‌కి ఎస్ చెప్పడంలేదని' అసలు విషయాన్ని చెప్పాడు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment