ప్రియుడు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ మోడల్

arachana-pandey-commit-sucide
ప్రముఖ మోడల్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అర్చనా పాండే (26) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల క్రితమే ఆమె ఆత్మహత్య చేసుకున్నా.. ఆ విషయం ఎవరికీ తెలియలేదు. చుట్టుపక్కల వాళ్లకు ఆమె ఇంటినుంచి దుర్వాసన రావడంతో వాళ్లు పోలీసులకు చెప్పగా విషయం బయటపడింది. తానింత తీవ్రనిర్ణయం తీసుకోడానికి తన బోయ్ ఫ్రెండు ఒమర్ పఠాన్ కారణమని అర్చనా పాండే తన ఆత్మహత్యలేఖలో పేర్కొంది.
ముంబై వెర్సోవా ప్రాంతంలోని న్యూ మహాడా కాలనీలోని ఓ అపార్టుమెంట్ 12వ అంతస్థులో అర్చనా పాండే ఉండేది. బెడ్ రూంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుంది. ఆమె మృతదేహం బాగా డీకంపోజ్ అయిపోయింది. పఠాన్ తనను తరచు వేధించేవాడని, అవమానించేవాడని, దాంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 2009లోనే మోడలింగ్ వదిలేసిన అర్చనా.. ప్రస్తుతం మీర్జా ప్రొడక్షన్ హౌస్ లో పనిచేస్తోంది.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment