సీఎం జయలలితకు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ప్రశంసలు

చెన్నయ్ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ మెయిల్ ద్వారా ప్రశంసలు పంపారు. ఈ మేరకు ఓ లేఖ పంపిన ఆయన, మహిళలు, పిల్లల సంక్షేమం కోసం తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని కితాబిచ్చారు.
'ఐ' చిత్రం ఆడియో రిలీజ్ వేడుకకు హాజరయ్యేందుకు ఈ నెల 15న ఆర్నాల్డ్ చెన్నై వచ్చారు. అప్పుడే సీఎం జయను కలసి మాట్లాడారు. ఇందుకు స్పందనగా ఓ లేఖ పంపిన ఆయన, "మహిళలు, చిన్నారుల కోసం మీరు చేస్తున్న కృషి నన్ను కదిలించింది. ఈ క్రమంలో తమిళనాడు అంతటా మిమ్మల్ని 'అమ్మ' అని పిలవడంలో నేను ఆశ్చర్యపడలేదు. గత ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం అద్భుతమైన ఆలోచన. చాలా ఆశ్చర్యపడ్డాను" అని తెలిపారు.
తమిళనాడు అంతటా జయ అనుసరిస్తున్న శుభ్రత, పునరుత్పాదక శక్తి అంశాలను ప్రస్తావించిన ఆర్నాల్డ్, తన 'ఆర్20: రీజియన్స్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్' సంస్థ ద్వారా తమిళనాడు ప్రభుత్వంతో పని చేసేందుకు ఆసక్తి తెలిపారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment