త్వరలో బాలీవుడ్ ప్రేక్షకులకు 'బొమ్మాళీ' అందాలు

aushka-bollywood
తన థండర్ థైస్ తో తెలుగు, తమిళ ప్రేక్షకులకు మత్తెక్కించిన అనుష్క.. త్వరలో బాలీవుడ్ సినిమాల్లో నటించనుందంట! ఇప్పటికే తెలుగులో మంచి శరీర సౌష్టవం ఉన్న హీరోయిన్ గా మంచి ఊపుమీదున్న ఈ బ్యూటీ చేతిలో బాహుబలి, రుద్రమదేవి, లింగ వంటి సినిమాలున్నాయి. ఇవి పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చినా అలాంటివేం లేవని ఇటీవల ఖండించింది. ఇప్పటికే సౌత్ నుంచి కాజల్, తమన్నా, అసిన్, త్రిష వంటివారు బాలీవుడ్ లో పాదం మోపారు. వీరిలో అసిన్, కాజల్ విజయవంతమవగా, తమన్నా (హిమ్మత్ వాలా), త్రిష (కట్టామీటా) తో పరాజయాలు చవి చూశారు. ఇప్పుడు స్వీటీ వంతు వచ్చింది. ఇటీవల ఒక దర్శకుడు ఆమెకు కథ వినిపించాడని, ఆమెకు కథ నచ్చిందని సమాచారం. అంటే త్వరలో బాలీవుడ్ జనాలు కూడా అనుష్క అందాలకు ఫిదా అవ్వాల్సిందేనన్నమాట!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment