జీమెయిల్, యాహూ అధికారిక వాడకంపై నిషేదం!

Gmail Yahoo Banned in India for official purpose

ప్రముఖ ఈ మెయిల్ సర్వీసులు జీమెయిల్‌, యాహూలను అధికారిక అవసరాలకు వాడకుండా భారతప్రభుత్వం నిషేధించే అవకాశముంది. దీంతో దేశంలోని  సుమారు ఐదారు లక్షల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు నేషనల్‌ ఇన్‌ఫర్మటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) అందించే ఈమెయిల్‌ సర్వీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(డీఈఐటీవై) ఈ అంశంపై కేంద్ర కేబినెట్‌కు ఒక ప్రతిపాదన పంపనుంది. నెలాఖరులోగా ఆమోదం పొందే అవకాశం ఉంది. దీంతో రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలు మినహా ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఎన్‌ఐసీ ప్లాట్‌ఫాం ఆధారంగా జరుగుతాయి. ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు మొత్తం రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకు అవసరమవుతుంది. రక్షణశాఖకు సురక్షితమైన సొంత ఈమెయిల్‌ సర్వర్‌ ఉంది. విదేశీ వ్యవహారాలశాఖ కూడా అదే బాటలో సాగే అవకాశముంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment