జబర్ధస్త్ జడ్జిపై ఎస్సీ, ఎట్రాసిటీ కేసు


roja-scst-atracity-case
చిత్తూరు జిల్లా నగరి వైకాపా ఎమ్మెల్ల్యే, సినీ నటి రోజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నగరి జాతరలో తనను కులం పేరుతో దూషించారని టీడీపీ కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రోజాతో బాటు మరో పదమూడు మందిమీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మున్సిపల్ చైర్మన్ కే.జే. శాంతిపై కూడా కేసు పెట్టారు. ఇటీవల నగరి గంగమ్మ జాతరలో టీడీపీ, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అమ్మవారికి రోజా హారతి ఇవ్వబోతుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ ఘటనలో ఆమె చేతికి గాయమైంది. దీంతో వైఎస్సార్సీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలమీద దాడికి యత్నించారు. రెండు వర్గాలూ పోలీసు స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి.  

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment