తమ్ముడిని డైరెక్ట్ చేయనున్న అన్నయ్య

dhanush-selvaraghuvan
రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్‌ తన అన్నయ్య సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నాడు. ధనుష్ కు అన్న సెల్వరాఘవన్ అంటే చాలా ఇష్టం. గౌరవం కూడా. ధనుష్ ప్రస్తుతం కథానాయకుడిగా, నిర్మాతగా విజయాల బాటలో దూసుకుపోతున్నారు.  తన ఉండర్ బార్ ఫిలింస్ పతాకంపై తానే హీరోగా నటించి,  నిర్మించిన  'వేలై ఇల్లా పట్టాదారి' మంచి విజయాన్ని సాధించింది. అయితే సెల్వరాఘవన్‌కు ఈ మధ్య సరైన విజయాలు లేవు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం 'ఇరండామ్ ఉలగం' చాలా నిరాశపరిచింది. దీంతో ఆయన దర్శకత్వం వహించవలసిన ఒకటి, రెండు చిత్రాలు ఆగిపోయాయి. సెల్వరాఘవన్ తెలుగులో 7జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment