Video Of Day

Breaking News

అలీబాబా దెబ్బకు.. వీసా, ఫేస్ బుక్ వెనక్కు

ecommerce-alibaba
హాంగ్ కాంగ్ లో ఒక చిన్న అపార్టమెంట్లో ప్రారంభమై నేడు అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్ సైట్ గా నిలిచిన చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా.... అమెరికా స్టాక్ మార్కెట్లో చరిత్రలో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) రికార్డును సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఒక్కో షేరుకు 68 డాలర్ల ఆఫర్ ధర చొప్పున రూ.1,30,800 కోట్లు సమీకరించింది. ఆఫర్ ధర ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ 168 బిలియన్ డాలర్లు.

రికార్డు బద్దలు
ఇప్పటిదాకా అమెరికా స్టాక్ మార్కెట్‌లో వీసా ఇన్‌కార్పొరేటెడ్ అతిపెద్ద ఐపీఓగా నిలుస్తూ వస్తోంది. 2008లో ఐపీఓకి వచ్చిన ఈ కంపెనీ 19.7 బిలియన్ డాలర్లను సమీకరించింది. ఇక 2012లో వచ్చిన ఫేస్‌బుక్ ఐపీఓ సమీకరణ విలువ 16 బిలియన్ డాలర్లు. దీని ప్రకారం ఫేస్‌బుక్ మార్కెట్ విలువ 104 బిలియన్ డాలర్లు (రూ.6,24,000 కోట్లు). తాజాగా (లిస్టింగ్‌కు రెండేళ్ల తర్వాత) ఈ కంపెనీ మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్లను అధిగమించడం తెలిసిందే. అయితే, అలీబాబా ఐపీఓ లిస్టింగ్ తొలి రోజే 200 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అధిగమించడం విశేషం. ఇప్పటిదాకా ప్రపంచంలో అతిపెద్ద ఐపీఓగా చైనాకు చెందిన అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా నిలిచింది. ఇప్పుడు రెండో అతిపెద్ద ఐపీఓగా కూడా చైనా కంపెనీ అలీబాబాయే నిలవడం విశేషం. 2010లో హాంకాంగ్ మార్కెట్‌లో లిస్టయిన అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా... 22.1 బిలియన్ డాలర్లను సమీకరించింది. కాగా, ఇప్పటిదాకా అమెరికాలోని టెక్నాలజీ ఐపీఓల్లో ఫేస్‌బుక్ నంబర్ వన్ స్థానంలో నిలుస్తూవస్తుండగా... దీన్ని కూడా అలీబాబా వెనక్కినెట్టింది. కాగా, నాస్‌డాక్‌లో ‘బాబా’ పేరుతో అలీబాబా స్టాక్ ట్రేడవుతోంది. మరోపక్క, మార్కెట్ విలువ పరంగా ప్రపంచ టెక్నాలజీ కంపెనీల్లో నాలుగో స్థానానికి అలీబాబా చేరింది. తొలి మూడు స్థానాల్లో యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కొనసాగుతున్నాయి.

అలీబాబా ప్రస్థానం
చైనాలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా వెలుగొందుతున్న అలీబాబాను చైనా ఎంట్రప్రెన్యూర్ జాక్ మా... హాంగ్‌ఝూలోని చిన్న అపార్ట్‌మెంట్
కేంద్రంగా ప్రారంభించారు. 1999లో తొలిసారిగా అలీబాబా.కామ్ పేరుతో ఈ-కామర్స్ (బిజినెస్ టు బిజినెస్.. అంటే ఉత్పత్తిదారులకు, ట్రేడర్లకు అనుసంధానకర్తగా) పోర్టల్‌ను మొదలుపెట్టారు.  చైనాలోని ఆన్‌లైన్ షాపింగ్ మార్కెట్లో అలీబాబా వాటా ఇప్పుడు 80%కిపైనే. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ స్థాయికి ఎగబాకింది కూడా.

No comments