రాజధానిలో యువతి గ్యాంగ్ రేప్


gangrape-delhi
దేశ రాజధానిలో మరో యువతి గ్యాంగ్ రేప్ కు గురైంది. యువతి స్నేహితుడు మరో ఇద్దరు మిత్రులతో కలిసి కదులుతున్న కారులోనే గ్యాంగ్ రేప్ చేసినట్టు సమాచారం. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ఏరియాలో చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీలోని ఓ మహిళా కానిస్టేబుల్ కుమార్తె అని, కూల్ డ్రింక్ లో మత్తు పదార్థాలు కలిపి ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కూల్ డ్రింక్ సేవించిన తర్వాత  అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతిపై సామూహిక అత్యారానికి పాల్పడి.. నెహ్రూ ప్లేస్ ఫ్లైఓవర్ వద్ద వదిలి వెళ్లారని పోలీస్ అధికారి తెలిపారు. గ్యాంగ్ రేప్ కు గురైనట్టు వైద్య పరీక్షలో తేలిందని పోలీసులు తెలిపారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment