ఆమె పొట్టలో 4 కిలోల జుట్టు

hair-wound
ఎవరైనా చాక్లెట్లు తింటారు, బిస్కట్లు తింటారు. కానీ, ఆ అమ్మాయి ఏకంగా జుట్టే తినేసింది. అది కాస్తా అలా అలా ఎక్కువైపోయి ఏకంగా ఆమె పొట్టలో నాలుగు కిలోల జుట్టు ఉండలా పేరుకుపోయింది. భరించలేని కడుపునొప్పి రావడంతో కిర్గిజిస్థాన్ లోని వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి ఆ ఉండ తొలగించారు. 18 ఏళ్ల వయసున్న ఆ అమ్మాయికి తన జుట్టు కొనలు తినడంతో పాటు ఇంట్లోని తివాచీకి ఉన్న ఊలు తినడం కూడా అలవాటేనట. ఆమె పేరు ఐపెరి అలెక్సీవా. ఆమె కిర్గిజిస్థాన్ లోని బాట్కెన్ రాష్ట్రానికి చెందినది. చివరకు మంచినీళ్లు కూడా తాగలేనంత స్థాయికి ఆరోగ్యం దిగజారిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె జీర్ణ వ్యవస్థలో పెద్ద ఉండ పేరుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. ఆమె పొట్ట బాగా వాచిపోయిందని, చివరకు లోపల నుంచి మొత్తం జుట్టు, ఊలు బయటకు తీశామని చెప్పారు. ఆమె మానసిక పరిస్థితి చక్కగా ఉందని, మళ్లీ ఇంకెప్పుడూ తాను జుట్టు తినబోనని కూడా తమకు చెప్పిందని వైద్యులు అన్నారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment