భార్యతో గొడవపడ్డ "ఇంద్రసేన"

indrasena-wife-issue
హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఓ సినిమా హీరో భార్యతో గొడవపడడంతో చిన్నపాటి కలకలం రేగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం 'కుర్ కురే' సినిమా హీరో ఇంద్రసేన ఒక విమానంలో ఇక్కడికి వచ్చారు. అతనిని రిసీవ్ చేసుకోవడానికి అతని భార్య కూడా విమానాశ్రయానికి వచ్చింది. ఆ హీరో, అతని భార్య మధ్య ఇంతకు ముందే మనఃస్పర్ధలున్నట్లు ఉన్నాయి. విమానాశ్రయంలోనే వారు ఇద్దరు గొడవపడ్డారు. వారు గొడవ పడటం చూసినవారు పోలీసులకు ఫోన్ చేసి ఒక మహిళను కిడ్నాప్ చేస్తున్నట్లు చెప్పారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వచ్చిన తరువాత అసలు విషయం తెలిసింది. అది కిడ్నాప్ కాదని, వారు ఇద్దరూ భార్యాభర్తలేనని,  గొడవ పడుతున్నారని అర్ధమైంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment