జగన్ కు జయలలిత పరిస్థితేనా?

jagmohanreddy
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అవినీతి ఆరోపణలతో జైలు శిక్షకు గురవడంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అవినీతి కేసులు తెరమీదకొచ్చాయి! ప్రతిపక్షాలు జగన్ లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేశాయి.. చేస్తున్నాయి. తాజాగా విజన్ ఆంధ్ర ప్రతినిధి.. న్యూస్ కవరేజ్ కోసం తిరుగుతుండగా.. చాలాచోట్ల.. జగన్ బాబు పరిస్థితి ఏమిటని అందరూ చర్చించుకోవడం కనిపించింది. వారి సంభాషణ ఇలా సాగింది. 'ఏరా మామ అధికారంలో ఉన్న జయలలితకే శిక్ష పడితే.. మరి జగన్ పరిస్థితి ఏమవుతుందంటావు?' 'ఏముందిరా ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాదైనా జయలలితలాగా మనోడు జైలుకు వెళ్లక తప్పదు'. అంతేనంటావా? ' చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉంటే మనోడికి చుక్కలే'. మోడీ కూడా అవినీతిపరుల పట్ల సీరియస్ గా ఉన్నాడ్రా.. కాబట్టి జగన్ జైలుకెళ్లడం ఖాయం అని తేల్చేశాడు ఆ వ్యక్తి. నిజమేనంటారా?
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment