తమిళనాడులో రెచ్చిపోయిన అమ్మ అభిమానులు

jayalalitha-violation
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జయలలితకు శిక్ష పడటాన్ని నిరసిస్తూ అన్నా డీఎంకే కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ప్రతిపక్ష డీఎంకే పార్టీ కార్యాలయాలపైనే, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇంటిపైనా దాడులకు దిగారు. పలు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. వందలాది వాహనాలకు నిప్పుపెట్టారు. జయలలితకు శిక్ష పడగానే డీఎంకే కార్యకర్తులు సంబరాలు చేసుకోగా, అన్నా డీఎంకే కార్యకర్తల్లో విషాదం అలుముకుంది. అన్నా డీఎంకే కార్యకర్త  ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అధికారులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో రాకపోకలను బంద్ చేశారు. చిత్తూరు, తమిళనాడు సరిహద్దుల్లో వాహనాలను ఆపివేశారు. సీనియర్ అధికారులు గవర్నర్ రోశయ్యను కలసి పరిస్థితిని వివరించారు. అన్నా డీఎంకే నాయకులు గవర్నర్ రోశయ్యను కలసి తమకు మరింత భద్రత కల్పించాలని కోరారు
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment