ఆరు నెలల్లో జగన్ పార్టీని మూయించేది ఎవరు?

jc divakarreddy
మరో ఆరు నెలల్లో జగన్ పార్టీ అదేనండీ.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని మూతపడనుందా అంటే అవునంటున్నారు అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. తనదైన శైలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరో ఆరు నెలల తర్వాత వైఎస్సార్ సీపీ అనేదే వుండదని జేసీ వ్యాఖ్యానించారు. మరో ఆరు నెలల్లో జగన్ ఏకాకి కావడం ఖాయమని జేసీ ఎద్దేవా చేశారు. జేసీ మాటలు ఎలా ఉన్నా ఈ ఐదేళ్లు జగన్ కు కంటిమీద కునుకు ఉండదనేది మాత్రం గ్యారెంటీ. ఇప్పటికే రోజుకో కేసు విచారణకు వస్తోంది. ఈనాడు తొక్కిపడేయాలనుకున్న సాక్షి ఇంతవరకు దాన్ని అందుకోలేకపోయింది. పార్టీ నేతలు ఒక్కొక్కరే జారుకుంటున్నారు. అరకు ఎంపీ గీత, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి జగన్ బాబుకు జలక్ ఇచ్చారు. ఇలా జగన్ పరిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్న చందాన ఉందని ప్రత్యర్థి పార్టీ వారు అంటున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment