పవన్ కల్యాణ్ ను తిట్టిపోస్తున్న 'చెల్లెమ్మ'

kalvakuntlakavitha-pawankalyan
మొన్నటి సాధారణ ఎన్నికల్లో తన వాడి, వేడి ప్రసంగాలతో జనాలను ఉర్రూతలూగించిన పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  మీద ఆయన 'చెల్లెలు' నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు నానా హడావిడి చేసిన పవన్ ఎన్నికల తరువాత పవన్ ఎక్కడున్నారు? ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? అని ఫైర్ అయ్యారు. ఆయన మేకప్ వేసుకున్నాక ప్యాకప్ చెప్పేసే వ్యక్తి.. అని ఎలక్షన్ల ముందు మేకప్ వేసుకుని వస్తాడు.. ఎన్నికలయ్యాక తిరిగి కనిపించడు..కానీ మేం మాత్రం ఎప్పుడూ ప్రజలతోనే ఉన్నాం..అలాగే కొనసాగుతాం అని ఆమె అన్నారు. అయితే పవర్ స్టార్ మీద ఈమె రెచ్చిపోవడానికి కారణం పవన్ పార్టీ పెట్టనున్నాడని వార్తలు వస్తున్నప్పుడు.. ముందు పవన్ కల్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి జనసేన ఆవిర్భావ సభలో పవన్ తనదైన శైలిలో కవిత మీద సెటైర్లు వేశాడు. 'అమ్మా చెల్లెమ్మా .. నీ బాధ నాకు అర్థమవుతోంది అమ్మా.. ముందు నువ్వు తెలంగాణ జాగృతి పేరుతో అందరి వద్ద దండుకున్న లెక్కలు చెప్పు.. ఇప్పటివరకు ఎంత పోగేశావు. ఖర్చు పెట్టిందెంత?' అంటూ వాగ్భాణాలు సంధించడం తెలిసిందే. ఇక ఆ దెబ్బతో నోరు మెదపని చెల్లెమ్మ.. ఇప్పుడు తలవని తలంపుగా పవన్ పై నిప్పులు చెరిగింది. ఎందుకు చెల్లెమ్మా? పవర్ కు ఎదుర్ బోతవ్.. అని పవన్ అభిమానులు అంటుండ్రంట! అయితే గోపాల.. గోపాల షూటింగ్ లో బిజీబిజీగా ఉన్న పవన్ కు ఈమె వ్యాఖ్యలు చేరాయో లేదా వేచి చూడాలి. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment