ఆమెకు చాలామంది ప్రపోజ్ చేశారంట!

kavtha-interview
సినిమా నటి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవిత గుర్తుందా? ఆ మధ్యకాలంలో ఆమె కూతురు కారు డ్రైవర్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే..
అందరి దగ్గరా కంఫర్టబుల్‌గానే ఫీలయ్యేదాన్ని. నిజానికి ఎన్టీయార్, శివాజీ గణేషన్... ఈ ఇద్దరితో మాట్లాడాలంటే అందరూ భయపడేవారు. కానీ నాకలా ఏమీ ఉండేది కాదు. ఎన్టీయార్ నన్నో చంటిపిల్లలాగా చూసేవారు. శివాజీగారయితే దగ్గర కూర్చోబెట్టుకుని డైలాగులు చెప్పడం నేర్పేవారు.
 చంద్రమోహన్‌తో నా జోడీ బాగుంటుందని అందరూ అనేవారు. ఆయన పక్కన హీరోయిన్‌గా 23 సినిమాలు చేశాను. ఇతరత్రా పాత్రల్లో కనిపించినవి కూడా లెక్కేస్తే యాభై, అరవై వరకూ ఉంటాయి. అలాగే కృష్ణగారితో 18 సినిమాలు చేశాను. మోహన్‌బాబుగారితో కూడా చాలా సినిమాలే చేశాను. తర్వాత పెళ్లి చేసుకున్నాను. చాలామంది అన్నారు... అందరూ పందొమ్మిదేళ్లకు హీరోయిన్ అవుతారు, నువ్వేమో హీరోయిన్ పొజిషన్‌ని వదులుకుని పెళ్లికి సిద్ధపడుతున్నావ్ అని. సినీ పరిశ్రమలో చాలామంది ప్రపోజ్ చేశారు. ఇప్పుడు సొసైటీలో టాప్ పొజిషన్స్‌లో ఉన్న కొందరు అప్పట్లో నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వాళ్ల గురించి ఆలోచించేంత తీరిక కానీ, పెళ్లికి సంబంధించిన నిర్ణయం తీసుకునేంత వయసు కానీ నాకప్పుడు లేవు. కాకపోతే ఇండస్ట్రీకి రాకముందు కృష్ణగారంటే ప్రాణం నాకు. హీరోయిన్‌ని అయ్యాక, ఆయనతో నటించేటప్పుడు డైలాగులు మర్చిపోయేదాన్ని. విజయనిర్మలగారు దర్శకత్వం వహించిన కొన్ని సినిమాల్లో కృష్ణగారి సరసన నటించాను. స్పాట్‌లో డైలాగులు చెప్పకుండా ఆయనవైపే చూస్తూ నిలబడిపోయేదాన్ని. విజయనిర్మలగారు ‘డైలాగ్ చెప్పకుండా అలా చూస్తావేంటి’ అనేవారు. ‘నావల్ల కావడం లేదండీ, ఆయనంటే నాకు చాలా ఇష్టం, ఆయన్ని చూస్తుంటే డైలాగులు గుర్తే రావడం లేదు’ అనేదాన్ని. ఆవిడ నవ్వేసేవారు. అంతేతప్ప ఎవరినీ ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవాలనీ అనుకోలేదు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment