కమల్ హాసన్ తో అయితే ఓకే అంట! రజనీకాంత్ ను ఒప్పుకోదంట!

khushboo-hot-comments-rajanikant
ఖుష్బూ గుర్తుందా? తెలుగులో వెంకటేశ్ తో కలియుగ పాండవులు అని సినిమా చేసింది. ఇంకా స్టాలిన్ లో చిరంజీవికి అక్కగా నటించింది. వివిధ టీవీ చానళ్లకు యాంకర్ గా కూడా వ్యవహరించింది. తమిళ దర్శకుడు సుందర్ ను పెళ్లి చేసుకున్న ఖుష్బూ.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఇకపై తాను కలిసి పనిచేయబోనని అన్నదని తమిళసినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 'ఒకవేళ ఆయనతో కలిసి పనిచేసే ఆఫర్ వచ్చినా అందుకు తాను ఒప్పుకోను' అని తెలిపిందంట.. ఈ అందాల సుందరి. ఇంతకీ ఆమె ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందో అర్థం కాక తమిళ తంబీలు జుట్టు పీక్కుంటున్నారట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, రజినీకాంత్‌తో కలిసి నటించబోనని తేల్చిచెప్పిన ఖుష్బూ.. కమల్ హాసన్‌తో నటించడానికైతే తానెప్పుడూ సిద్ధమే అని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవానికి అది నిజం కాదట. ఆనోటా ఈనోటా అసలు విషయం తెలుసుకున్న ఖుష్బూ మళ్లీ అదే ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌కి క్లారిటీ ఇచ్చింది. కమల్‌తో, రజినికాంత్‌తో ఎవరితో ఆఫర్ వచ్చినా అసలు తాను ఇక సినిమాల్లోనే నటించేది లేదని వివరణ ఇచ్చిందని సమాచారం.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment