పవన్ హీరోయిన్ తో అసభ్యంగా.. ఆ అధికారి!

kruthikarbandha-hot
కన్నడ సినీ నటి కృతి కర్బందాకు ఇటీవల బెంగుళూరు ఎయిర్‌పోర్టులో అవమానం  జరిగింది. ఎయిర్ ఇండియా సిబ్బంది తన  పట్ల అమర్యాదకరంగా, దారుణంగా ప్రవర్తించారని ఈమె తన ఫేస్‌బుక్‌లో వాపోయింది. ఈ సంస్థ అధికారి ఒకరు నన్ను దుర్భాషలాడాడు..  అసభ్యంగా తిట్టాడు. ఇతర సిబ్బంది ఎవరూ నన్ను ఆదుకోవడానికి రాకపోగా అతనికే సపోర్ట్‌గా నిలిచారు  అని పేర్కొంది. హైదరాబాద్ నుంచి గత ఆగస్ట్ 16న తాను బెంగుళూరు ఎయిర్‌పోర్టులో దిగి తన లగేజీ చెకింగ్ చేయించుకుంటుండగా చెకింగ్ అధికారి మూడు కేజీల బరువు ఎక్కువగా ఉందని, అందుకు అదనపు సొమ్ము చెల్లించాల్సిందేనని పట్టు బట్టాడని కృతి తెలిపింది. అయితే అంతకుముందు రెండు రోజుల క్రితమే అదే బరువున్న లగేజీతో వచ్చినా ఇలా కోరలేదని, తాను ఇదే విషయాన్ని ప్రస్తావించగా ఆ అధికారి కర్కశంగా మాట్లాడాడని ఆమె తెలిపింది. అతని వైఖరిపై పై అధికారులకు ఫిర్యాదు చేసినా అతనికే వత్తాసు పలికారని వెల్లడించింది. సిబ్బంది నిర్వాకంపై ఈ అమ్మడు ఎయిర్ ఇండియా యాజమాన్యానికి ఓపెన్ లెటర్ రాసింది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో కలిసి కృతి కర్బందా ఇటీవల నటించిన సూపర్ రంగా సినిమా హిట్ అయింది. రవితేజ కిక్ మూవీకి ఇది రీమేక్. కన్నడలో మరో ఆరు సినిమాల్లో కృతి నటించబోతోంది.   
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment