సీనియర్ నటిని చంపుతామని బెదిరిస్తున్నారంట

 సీనియర్ నటి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ హత్యా బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. తమిళంలో పిరివోమ్ సందిప్పోమ్, తిరు తిరు తురు తురు, ఈరం, నాడోడిగళ్, బాస్ ఎన్గిర భాస్కరన్ తదితర చిత్రాల్లో ముఖ్య భూమికలను పోషించారు. మలయాళంలోనూ కొన్ని చిత్రాలు చేసిన లక్ష్మీరామకృష్ణన్ ఆరోహణం చిత్రం ద్వారా దర్శకురాలిగా మారారు. ప్రస్తుతం నెరింగవా ముత్తమిడాదే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే విధంగా సొల్వ దెల్లాం ఉన్నై అనే టీవీ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జీవితంలో వేదనకు గురైన వారిని వేదికపైకి తీసుకొచ్చి వారి సమస్యలను చర్చించడమే ప్రదానాంశం. ఈ కార్యక్రమం వలన నటి లక్ష్మీ రామకృష్ణన్‌కు కొందరు వ్యక్తుల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. టీవీ కార్యక్రమంలో లక్ష్మీమీనన్ వివాద స్పద అంశాలను చర్చకు తీసుకొస్తుండటమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ విషయమై నటి లక్ష్మీ రామకృష్ణన్ భర్త పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment