ఈనాడు నెంబర్ వన్.. రెండో స్థానంలో సాక్షి

దేశంలోని దినపత్రికల సర్టిఫైడ్ సర్క్యులేషన్ వివరాలని అందించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ABC) ఈ ఏడాది కూడా మొదటి అర్ధసంవత్సరకాలాని(జనవరి – జూన్ 2014)కి తెలుగు దినపత్రికల సర్క్యులేషన్ గణాంకాలను ఈమధ్యే విడుదల చేసింది. ఈ పీరియడ్ మధ్య కాలంలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. సాధారణంగా ఎన్నికల ప్రభావం అనేది దినపత్రికల అమ్మకాలని పెంచుతుంది. అంటే, సర్క్యులేషన్ కూడా పెరుగుతుందన్నమాట. కానీ ఈసారి దినపత్రికల సర్క్యూలేషన్ పెరుగుదలలో భారీ వృత్యాసాలేమీ నమోదు కాలేదు. ఈ పీరియడ్‌కి ముందు 18.01 లక్షల కాపీల పంపిణీ వున్న 'ఈనాడు' మరో 20 వేల సర్క్యూలేషన్‌ని పెంచుకుని 18.21 లక్షలుగా నమోదైంది. 'ఈనాడు'ని అనుసరిస్తూ 12.58 లక్షల కాపీలతో సాక్షి రెండవ స్థానంలో నిలిచింది. సర్య్యూలేషన్ గ్రోత్‌లో 3,676 కాపీలని అధికంగా అమ్ముకోగలిగింది. ఆ తర్వాత మూడవ స్థానాన్ని సొంతం చేసుకున్న 'ఆంధ్రజ్యోతి' 5.12 లక్షల సర్క్యులేషన్‌ని కలిగివుంది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment