మళ్లీ సినిమాలకు సిద్ధమవుతోన్న నేపాలీ సుందరి

manisha-entry-movies
'తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో' అంటూ క్రిమినల్ సినిమాలో నాగార్జునతో ఆడిపాడిన హాట్ ఫిగర్ మనీషా కొయిరాలా గుర్తుందా? ఇటీవల కేన్సర్ వ్యాధికి గురై దాంతో పోరాడి విజయం సాధించింది. అర్జున్ ఒకరోజు ముఖ్యమంత్రి పాత్రలో నటించిన ఒకే ఒక్కడు, కమల్ హాసన్ భారతీయుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మనీషా కొయిరాలా.. మళ్లీ మేకప్ వేసుకుంటోంది. యోగాతో తనను తాను మళ్లీ పూర్తి ఆరోగ్యవంతురాలిగా తీర్చిదిద్దుకుంది. అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే, రాజ్ కుమార్ సంతోషి తీయబోయే తదుపరి చిత్రంలో ఆమె నటించే అవకాశం ఉంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment