రజినీకి ఇది సరైన సమయమా?

modi with rajinikanth

తమిళనాడులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు జైలు శిక్షపడటంతో ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాట రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జయలలిత ప్రభుత్వం "అమ్మ" పథకాలతో ముందుకు దూసుకుపోతున్న సమయంలో ఎప్పటిదో 18 ఏళ్ల క్రితం కేసులో ఇప్పుడు శిక్ష పడడం నెత్తిన పెద్ద బండరాయి పడ్డట్టైంది. తిరుగు లేని పార్టీలుగా కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే, జయ నేతృత్వంలోని అన్నాడీఎంకేలు ఇప్పుడు చతికిలపడ్డాయి. తాజాగా జయ పార్టీ అన్నాడీఎంకే ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. డీఎంకే పార్టీ కుటుంబ కలహాలతోపాటు, కుంభకోణాల్లో ఇరుక్కుని కిమ్మున కూర్చున్నారు. పార్టీ నేతలు కనిమొళి, కేంద్ర మాజీ మంత్రి రాజా సైతం జైలు పాలై విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కరుణ కుటుంబీకులపై సీబీఐ పంజా ఝలిపిస్తోనే ఉంది. ఈ కారణాలతోనే గత ఎన్నికల్లో డీఎంకే పార్టీ తీవ్ర ఓటమి చవిచూసింది. ఈ పరిణామాలు ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రజనీని మార్గం సుగమం చేయనున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న రజినీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోని వారు కూడా ఉండకపోవచ్చు. అయితే రాజకీయాలపై రజినీ ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపకపోవచ్చని సైతం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నాయి. కానీ కేంద్రంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న బీజేపీ తమిళనాట పాగా వేయడానికీ అదను దొరికినట్లుగా భావించే అవకాశం ఉంది. అభిమానం, ప్రాంతీయతత్వాల గోడలను పెకిలించలేకపోయిన జాతీయ పార్టీలు ఇప్పుటు స్థానం సంపాదించుకోవడానికీ ముందుకొస్తున్నాయి. పార్టీ అధినేత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎన్నికల ముందు రజినీని కలిశాడు. ఈ పరిచయాన్ని ఇప్పుడు అనుకూలంగా మార్చుకునే అవకాశమూ ఉంది. సూపర్ స్టార్ రజనీనికి ఈ అంశం కలిసొచ్చేలానే ఉంది!!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment