ఆదిగురువు అమ్మే : ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ : సాధారణ విద్యార్థి గురువు నుంచి స్ఫూర్తి పొందుతాడని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లోలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ప్రతిభావంతులు ఎలా కావాలో నేర్పేది గురువేనని అన్నారు. గురువంటే స్కూల్ లో పాఠాలు చెప్పేవారే కాదని, మన జీవితాల్లో వెలుగులు నింపే ప్రతి ఒక్కరూ గురువేనని ఆయన అన్నారు. ఆది గురువు అమ్మ అని ఆయన తెలిపారు. గతంలో గ్రామాల్లో ఉత్తమమైన వ్యక్తి ఎవరంటే గురువేనని అందరూ చెప్పేవారని ఆయన తెలిపారు. 
విద్యార్థులతో సమావేశమయ్యే అదృష్టం తాను చేసుకున్నానని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ అంత గొప్ప ఉపాధ్యాయులు కావాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. అంత గొప్ప ఉపాధ్యాయుల్ని భారతదేశం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పరిశీలనాత్మక దృక్పధాన్ని అలవాటు చేయాలని ఆయన సూచించారు. 
భారతదేశంలో ఉపాధ్యాయులకు మంచి డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. ప్రతి విద్యార్థి మంచి ఉపాధ్యాయుడిగా తయారవుతానని భావించేలా గురువులు శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment