ఎన్టీ రామారావు పేరును అందుకే ఇవ్వలేదంట

ntr-bharatha ratna
జనవరి 26 రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి అవార్డులను ప్రకటిస్తుంది. భారతరత్నను కూడా ఒక్కోసారి ఇస్తుంది. వచ్చే ఏడాది కోసం ఎన్టీ రామారావు పేరును ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఏపీ ప్రభుత్వం అనుకుందంట! చంద్రబాబు కూడా ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పిస్తే తనపై ఉన్న వెన్నుపోటు ముద్ర తొలగిపోతుందని భావించాడంట! అయితే నిబంధనల ప్రకారం అవార్డు ప్రకటించిన వ్యక్తి జీవించి ఉండకపోతే.. భార్యకు అవార్డు ప్రదానం చేయాలి. అప్పుడు లక్ష్మీ పార్వతి.. రామారావు భార్యగా అవార్డు తీసుకోవాల్సి వస్తుందని.. అందుకే మామ పేరును భారతరత్నకు సిఫారసు చేయలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు పేరును రికమెండ్ చేయనుందని తెలుస్తోంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment