Video Of Day

Breaking News

'మీడియాకు మేము వ్యతిరేకం కాదు'

న్యూఢిల్లీ: జీఎస్టీ పన్ను విధానంతో రాష్ట్ర ఖజానాకు గండిపడే అవకాశం ఉందని తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. గతంలో వ్యాట్ అమలు చేసిన సందర్భంలో రాష్ట్రానికి రావల్సిన వాటా కేంద్రం ఇంతవరకు ఇవ్వలేదని, వ్యాట్ కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ. 5 వేల కోట్లు రావాలన్నారు. ఎక్సైజ్, పెట్రోలియం,పొగాకు, వరి ఉత్పత్తులపై పన్నులను జీఎస్టీ చేర్చొద్దని సూచించారు.
తెలంగాణ బడ్జెట్‌ను పకడ్బందిగా రూపొందిస్తున్నామని చెప్పారు. హడావుడిగా కాకుండా సంపూర్ణంగా బడ్జెట్ ప్రవేశపెడతామని, బడ్జెట్ ఆలస్యంకావడమనేది రాజ్యంగా విరుద్దమేమి కాదన్నారు. కొత్త రాష్ట్రం కనుక అన్నిఅంశాలను పరిగణలోకి తీసుకోవాల్సివుంటుందన్నారు.
మీడియాకు తాము వ్యతిరేకం కాదని, కొన్ని చానెళ్లు తమ ఎమ్మెల్యేలను కించపరిచే విదంగా ప్రసారాలు చేశాయని తెలిపారు. ఈ మొత్తం అంశంపై చర్చకు తాము సిద్దమని ఈటెల రాజేందర్ ప్రకటించారు.

No comments