హైదరాబాద్ లో శాంతిభ్రదతలు గవర్నర్ చేతిలోనే : రాజ్ నాథ్ సింగ్

న్యూఢిల్లీ :  హైదరాబాదులో శాంతిభద్రతలపై అధికారాలు గవర్నర్ చేతిలోనే ఉంటాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా మీడియాపై కేసీఆర్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలను రాజ్ నాథ్ ఖండించారు. ఈ విషయంలో, కేసీఆర్ తో తాను మాట్లాడతానని... చానళ్ల పునరుద్ధరణపై కూడా ఆయనతో చర్చిస్తానని రాజ్ నాథ్ హామీ ఇచ్చారు. వరదల కారణంగా కకావికలమైన కాశ్మీర్ లో సహాయక చర్యలను సైన్యం అద్భుతంగా నిర్వర్తించిందని ఆయన కితాబిచ్చారు. సుమారు 1.30 లక్షల మందిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంతో చాకచాక్యంగా రక్షించాయని రాజ్ నాథ్ వారిపై ప్రశంసలు కురిపించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment