తమిళనాడు రాజధాని.. బెంగళూరంటున్న దర్శకుడు

ram-gopal-varma-hot-comments-jayalalitha
తన సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే దర్శకుడు.. రాంగోపాల్ వర్మ. తాజాగా ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యవహారంపై సెటైర్లు వేశారు. భారతదేశం అంతా ఒక్కటిగానే ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అక్కర్లేదని కూడా వర్మ అన్నారు. విషయం ఏమిటంటే, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పరప్పన అగ్రహార ప్రాంతంలోని జైల్లో ఉండటం, తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. ప్రతిరోజూ అన్నాడీఎంకే కార్యకర్తలు, అమ్మ అభిమానులు, ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు, ఎంఎల్ఏలు ఇలా ఎవరో ఒకరు బెంగళూరు వచ్చి అమ్మను కలిసి కాసేపు ఏడ్చి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్మ తనదైన శైలిలో.. తమిళనాడు రాజధాని చెన్నై కాదని బెంగళూరు అని తేల్చేశాడు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment