మణిరత్నం సినిమాకి నో చెప్పాడంట!

ramcharan-reject-maniratnam-movie
భారతీయ అగ్రదర్శకుడు మణి రత్నం గురించి పరిచయం అక్కర్లేదు. రోజా, బొంబాయి, దళపతి, ఇద్దరు, నాగార్జున గీతాంజలి, సఖి వంటి సూపర్ హిట్ మూవీస్ తో దేశం గర్వించదగిన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చకున్నారు. ఆయన దర్శకత్వంలో ఒక్కసారైనా, చిన్నపాత్రలోనైనా మెరవాలని నటులందరూ అనుకొంటారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం మణిరత్నం సినిమాను తిరస్కరించాడంట! తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు. ఆయన తనకు కథ చెప్పారని, అయితే ఆ కథ తనకు నప్పదని ఇద్దరమూ అనుకున్నామని అన్నాడు. అంతేకాకుండా కమర్షియల్ గా వర్కవుట్ కాదని తెలిపాడు. 'నాతో సినిమాలు చేసిన నిర్మాతలు నష్టపోకుండా డబ్బులు బాగా సంపాదించాలనేది నా లక్ష్యం' అని పేర్కొన్నాడు. నిర్మాతలు బాగుపడే సినిమాలే చేస్తానని అన్నాడు ఈ మెగా పవర్ స్టార్
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment