"జబర్దస్త్" జడ్జి రోజా ప్రాణాలకు ముప్పు!

roja-threat
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ రోజా ప్రాణాలకు శత్రువుల నుంచి ముప్పు ఉందని ఆమె భర్త ప్రముఖ దర్శకుడు సెల్వమణి ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల కిందట తన నియోజకవర్గంలో గ్రామ దేవతలకు హారతి ఇవ్వడానికి వెళ్లిన రోజాపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయడం తెలిసిన విషయమే. ఈ దాడిలో ఆమె చేతికి గాయమైంది. అంతేగాక ఆమె చేతిలోని హారతి పళ్లెంను తోసివేయడంతో కిందపడిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దుందుడుకు చర్యలకు కలత చెందిన రోజా బైఠాయించి నిరసన తెలిపారు. ఇటువంటి పరిస్థితులను రోజా ధీటుగా ఎదుర్కోగలదని, అయితే ఈ సమయంలో ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తాను భయపడుతున్నట్లు సెల్వమణి చెప్పారు. రోజా చిత్తూరు జిల్లాలోని నగరి నుంచి ఎంఎల్ఏగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశానికి చెందిన గాలి ముద్దు కృష్ణమ నాయుడుపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment