మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు అంటున్న శరత్ కుమార్

saratkumar-amma-comments
జయలలితకు మద్దతుగా తమిళ సినిమా పరిశ్రమ స్వచ్ఛందంగానే ముందుకు వచ్చిందని నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ తెలిపారు. తమకు తాముగానే నిరాహారదీక్ష చేస్తున్నామని వెల్లడించారు. దీనికోసం తమకు ఎవరూ బెదిరించడంగాని, ఒత్తిడి చేయడంగాని చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక జైలులో ఉన్న జయలలితకు మద్దతుగా తమిళ సినిమా  పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఇతరులు మంగళవారం నిరాహారదీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టాలని తమపై ఎవరూ ఒత్తిడి చేయలేదని శరత్ కుమార్ తెలిపారు. సినిమా పరిశ్రమకు 'అమ్మ' ఎంతో చేశారని, ఆపదకాలంలో ఆమెకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment