హాట్ లేడీపై అతని కళ్లు పడ్డాయి!


shane-warne-hotlady
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కామ కలాపాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. భార్య ఉండగానే అప్పట్లో ఇద్దరు మోడళ్లతో సరసాలు చేస్తూ మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు. ఆ తర్వాత హాలీవుడ్ బ్యూటీ ఎలిజబెత్ హార్లేతో ప్రేమాయణంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఇటీవల ఎలిజబెత్ హార్లేతో తెగదెంపులు చేసుకున్న షేన్ వార్న్ లో దుస్తుల మాజీ మోడల్ మిచెల్లీ మోన్‌తో రొమాన్స్ సాగిస్తున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. ఎలిజబెత్ హర్లేతో 'సంబంధం' కటీఫ్ అయ్యిందంటూ యూకే మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో 44 ఏళ్ల వార్న్ మరో మోడల్‌తో 'అత్యంత సన్నిహితం'గా ఉన్నాడన్న వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment