కోర్టుకెళతా- శ్రీదేవి

sridevi-court
అధికారాన్ని దుర్వినియోగం చేసి అడ్డదారిలో డీసీసీబీ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుందని కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ)  చైర్‌పర్సన్ శ్రీదేవి ఆరోపించారు. డైరెక్టర్లను బెదిరించి అవిశ్వాస తీర్మానంలో తమకు మద్దతుగా అధికార పార్టీ ఓటు వేయించుకుందన్నారు. అవిశ్వాస తీర్మానంపై న్యాయపోరాటం చేస్తానని ఆమె తెలిపారు. శ్రీదేవిపై మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆమె పదవి కోల్పోయారు. అవిశ్వాసతీర్మానానికి 15 మంది డైరెక్టర్లు అనుకూలంగా ఓటు వేశారు. మీడియా అనుమతించకుండా, తలుపులన్ని మూసేసి అవిశ్వాస తీర్మానం పెట్టడం గమనార్హం.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment