గబ్బర్ సింగ్ హీరోయిన్ పెళ్లికి ముందే తల్లి అవుతుందంట!

sruthi hasan
తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న శృతి హాసన్ పెళ్లికి ముందే తల్లి అవ్వాలని అనుకుంటుందంట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అభిప్రాయాన్ని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లికి ముందే తాను ఓ బిడ్డకు జన్మనివ్వాలని, ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని ఆమె పేర్కొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏంటీ.. శృతి నిజంగా ఇలా చెప్పిందా అని కొంతమంది ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలావుంటే శృతికి కూడా తండ్రి కమల్ హాసన్ లక్షణాలే వచ్చాయని అందరూ అనుకుంటున్నారంట! కమల్ కూడా తన ప్రతి సినిమాలో హీరోయిన్ల పెదాలను తడపందే ఊరుకోడని.. అదేవిధంగా శృతి కూడా మంచి దూకుడుగా వెళ్తుందని తెలుస్తోంది. తన తండ్రి పాత హీరోయిన్ గౌతమితో సహజీవనం చేస్తున్నాడు. శృతి కూడా ఇంతకుముందు బొమ్మరిల్లు హీరో సిద్ధార్థతో డేటింగ్ చేసిందని వార్తలొచ్చాయి. అదేవిధంగా రజనీకాంత్ అల్లుడు ధనుశ్ ను కూడా తన ట్రాప్ లోకి దించబోయిందని, అయితే అతని భార్య జాగ్రత్తపడటంతో లవ్ మ్యాటర్ ముందుకు సాగలేదని పుకార్లు షికారు చేశాయి. అయితే డీ డే వంటి సినిమాల్లో శృతి ఓవర్ ఎక్సపోజింగ్ చూశాక.. ఆమె పెళ్లికి ముందే తల్లైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కొంతమంది అంటున్నారు
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment