తన నగ్న ఫొటోపై సంతకం చేయనంటున్న హీరోయిన్

titanic-cate-winslet
ఓడ మునిగిపోయిన నేపథ్యంతో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ టైటానిక్ ను ఎవరూ మర్చిపోరు. లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్స్‌లెట్‌ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల తుఫాను సృష్టించింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్ కేట్ విన్స్‌లెట్ నగ్న అందాలను హీరో లియోనార్డో డికాప్రియో తన పెయింటింగుతో చిత్రీకరించడం సినిమాకు హైలెట్. ఈ మధ్య కేట్ విన్స్‌లెట్ ఎక్కడ కనిపించినా....పలువురు అభిమానులు టైటానిక్ చిత్రానికి సంబంధించిన ఆమె నగ్న పోటోను తీసుకొచ్చి ఆమెతో ఆటో గ్రాఫ్ చేయించుకోవడానికి పోటీ పడుతున్నారు. అయితే తన నగ్న ఫోటోపై సంతకం చేయడం నాకు అస్సలు నచ్చదు, ఎవరైనా అభిమానులు అలా అడిగితే నేను ఇబ్బందిగా ఫీలవుతాను అని ఈ నగ్న సుందరి చెప్పింది.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment