పవర్ స్టార్ కు .. వెంకటేశ్ బహుమానం?

venkatesh-pawan-kalyan_
పవన్ కల్యాణ్, వెంకటేశ్ ల మధ్య స్నేహం ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించాలనుకుంటున్నారు. అది ఇప్పటికి కుదిరి 'గోపాల గోపాల' మూవీలో కలిసి నటిస్తున్నారు. సినీవర్గాల సమాచారం మేరకు ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉన్న వెంకీ, పవన్‌లు ఇద్దరూ షూటింగ్ లో షాట్‌కి షాట్‌కి మధ్య గ్యాప్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారంట. అనేక ఆధ్యాత్మిక అంశాలపై ఇద్దరూ చర్చల్లో మునిగితేలుతున్నారంట. ఈ క్రమంలోనే వెంకీ.. పవర్ స్టార్ కు మంచి ఆధ్యాత్మిక అంశాలతో కూడిన కొన్ని సాహిత్య గ్రంథాలు, డీవీడీలని ప్రజెంట్ చేశాడని టాక్.  
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment