విజయవాడ - గుంటూరు మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాజధాని

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై ఉహించినట్లే జరిగింది. నర్మగర్భంగా చెప్పిన వ్యాఖ్యలనే అధికార పక్షం నిజం చేసింది. మధ్యలో మధ్యలో అంటూ ముందు నుంచీ చెప్పుకొచ్చిన ప్రభుత్వం అదే మాటకు కట్టుబడింది. తాత్కాలికం అంటూనే.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విజయవాడ పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటన చేశారు.
ఏపీ రాజధాని అంశంపై చర్చ, ఓటింగ్ చేపట్టిన తర్వాతే ప్రకటన చేయాలని ప్రధాన ప్రతిపక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండగానే చంద్రబాబు ప్రకటన చేసుకుంటూ పోయారు. విజయవాడ చుట్టూ రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో 3 మెగాసిటీలు, 14 స్మార్ట్‌సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆకాశాన్ని అంటిన భుమల ధరలు.... తాజాగా రాజధాని ప్రకటన నేపథ్యంలో మరోసారి రియల్ బూమ్ కు తెర లేచినట్లు అయ్యింది.
కాగా విజయవాడ సమీపంలో రాజధాని ఉంటుందని ప్రకటన నేపథ్యంలో ఎక్కువ అద్దెలు ఇచ్చే కార్పొరేట్ సంస్థలకు తమ భవనాలను లీజుకు ఇచ్చేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ అద్దెలు చెల్లించే ప్రభుత్వ కార్యాలయాలను ఆరు నెలల్లో ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో విజయవాడతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment