టీ టీడీపీ నేతలకు దమ్ముంటే !

టీ టీడీపీ నేతలకు దమ్ముంటే కరెంట్ కష్టాలపై చర్చలకు రావాలని మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి  జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ..
కరెంట్ కష్టాలకు చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క విద్యుత్ ప్రాజెక్టు అయినా తెలంగాణలో పెట్టిండా అని అడిగారు. బాబు కుట్రలకు నిరసనగానే టీ టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. సొంత పార్టీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీ టీడీపీ నేతలకు ఇంగిత జ్ఞానం లేకుండా బస్సు యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
T_TDP-TRS-Jagadishwar_Reddy

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment