Video Of Day

Breaking News

తెలంగాణ ఉద్యోగులకు ఆరోగ్యకార్డులు

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు ఆరోగ్యకార్డులను సిద్ధం చేశారు.: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్‌ అధికారులు, పింఛనుదారులకు ఉచిత వైద్య సేవలందించే ఆరోగ్యకార్డుల పంపిణీ బుధవారం ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య సచివాలయంలో లాంఛనంగా ఈ కార్డులను ఉద్యోగ నేతలకు అందజేశారు. ఇప్పటికే వివరాలు నమోదైనందున తమ ఇంటివద్దనే వాటిని పొందేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొనే సౌకర్యం కల్పించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.19 లక్షల ఉద్యోగులు, అధికారుల కుటుంబాలు, 2.50 లక్షల పింఛనుదారుల కుటుంబాలకు ఆరోగ్యసేవలు అందుతాయి. మంగళవారం  సీఎం చేతుల మీదుగా కార్డులను పంపిణీ చేయాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆయన రాలేదు. సీఎం ఆదేశాల మేరకు ఉపముఖ్యమంత్రి రాజయ్య కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్‌ దేవీప్రసాద్‌, టీజీవోల ఛైర్మన్‌, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీ పూల రవీందర్‌, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌, ఇతర నేతలు మమత, రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, పి.వెంకటరెడ్డి, రేచల్‌,

No comments