ట్రాఫిక్ జామ్ అయిందా అయితే వాట్సప్ ఉందిగా!

ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు ఢిల్లీ పోలీసులు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీలో గల్లీలు ఎక్కువ. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తలకు మించిన భారం అవుతోంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం, అనధికార పార్కింగ్ లు ట్రాఫిక్ ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి. దీనికి పోలీస్ శాఖ పరిష్కారం కనుగొంది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగినా, ట్రాఫిక్ ఉల్లంఘనలు, అనధికార పార్కింగ్ వల్ల ఇక్కట్లు వచ్చినా స్మార్ట్ ఫోన్ ద్వారా ఓ ఫోటో తీసి వాట్సప్ లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే చాలు, సమస్యను పరిష్కరిస్తామని ఢిల్లీ పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే 08750871493 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment