ఎక్కడైనా.. ఎప్పుడైనా ఆధార్ కార్డు జారీ!

దేశంలో ఆధార్ కార్డులకు క్రమంగా ప్రాధాన్యం పెరిగింది. దీంతో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కార్డుల జారీని నిర్దేశిత ప్రాంతాలకే పరిమితం చేసిన ప్రభుత్వం, తాజాగా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 
ఆధార్ కార్డుల జారీని మరింత సరళతరం చేయడంతో పాటు అన్ని ప్రాంతాల్లో ఆధార్ కార్డుల జారీని అందుబాటులోకి తీసుకురావాలని సదరు ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఒక వ్యక్తికి ఒకే ఆధార్ సంఖ్యను జారీ చేస్తున్నందున సదరు వ్యక్తి గుర్తింపు, చిరునామా కోసం దేశవ్యాప్తంగా ఈ కార్డులను పరిగణనలోకి తీసుకుంటారు. 2009 లో మొదలైన ఆధార్ నమోదు ప్రక్రియలో ఇప్పటిదాకా రూ.4,906 కోట్ల మేర ఖర్చైంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment