బీర్ తాగకుండానే కిక్ ఎక్కనుంది

 beer-not-driking

బీరు తాగకుండానే బీరు బాబులకు కిక్ ఎక్కనుంది . బీరు సీసా ధర దాదాపు 20 శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. . ముడిసరుకుతో పాటు ప్రొడక్షన్ కాస్ట్ పెరగడంతో నష్టాలు వస్తున్నాయని..ధరలు పెంచాలని బేవరేజెస్ కంపెనీలు డిమాండ్ చేశాయి. బీరుపై ధరను 35 శాతం పెంచాలని రాష్ట్ర విభజనకు ముందే టెండర్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్స్ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. దీంతో 20 శాతం పెంచాలని నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు చెప్పారు. దీంతో బీరుబాబులపై  దాదాపు రూ. 400 కోట్ల నుంచి 500 వరకూ భారం పడనుంది. రాష్ట్రంలో నెలకు దాదాపు నాలుగు కోట్లకు పైగా బీర్లు అమ్ముడవుతున్నాయి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment