హైటెన్షన్ తీగలు తెగిపడి ముగ్గురి సజీవదహనం

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బొల్లాపురం మండలం రావులాపురంలో విద్యుత్ తీగలు తెగి.. లారీపై పడ్డాయి. బోర్ వెల్స్ పైపులతో వెళ్తున్న లారీ మీద హైటెన్షన్ విద్యుత్ తీగలు పడటంతో వెంటనే షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవంగా దహనమయ్యారు. తమిళనాడుకు చెందిన లారీ శనివారమే బొల్లాపురం వచ్చింది. అందులో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు.
పొలంలో బోర్ వెల్ వేసే క్రమంలో ఇనుప రాడ్లు పైకి లేపడం, అప్పటికే హైటెన్షన్ తీగలు కొంతవరకు తెగి ఉండటంతో ఆ తీగలు ఇనుప రాడ్లకు తగిలాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇంజన్ లోంచి మంటలు వచ్చాయి. కేబిన్ లోంచి బయటకు రాలేక ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మిగిలినవాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినుకొండకు వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులెవరూ సమీపంలోకి కూడా రాలేని పరిస్థితి. స్థానికంగా ఉన్న ప్రజలే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment