పురుషులు బరువు తగ్గేందుకు 5 సూత్రాలు!

అధిక బరువు అనర్థదాయకం! వైద్యులు చెప్పే మాట ఇది. ప్రస్తుతం ఎందరో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు ఊబకాయానికి కారణం. వయసుకు తగిన బరువు ఉండడమనేది ఆరోగ్యవంతుల లక్షణం. ఒకవేళ అధిక బరువుతో బాధపడుతూ ఉంటే, అందుకు పంచసూత్ర ప్రణాళిక పాటిస్తే సరి. ఇంట్లో మెట్లు ఉంటే వాటిని ఎక్కిదిగడం అలవాటు చేసుకోవాలి. అలాంటి ఎక్సర్ సైజులు అదనపు కెలోరీలను బాగా ఖర్చుచేస్తాయి. నీళ్ళు అధికంగా తాగాలి. ఆరోగ్యానికి ఇదో మంచి మార్గం. రాత్రి 9 తర్వాత భోజనానికి నో చెప్పాలి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య 3 గంటల విరామం ఉండేట్టు చూసుకోవాలి. తద్వారా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కొవ్వు పదార్ధాలు కూడా చక్కగా జీర్ణమవుతాయి.
వారానికి ఓ రోజు ఇష్టమైన ఆహార పదార్థాన్ని కడుపారా తినండి. మనకు నచ్చిన వంటకాన్ని తినగలిగినంత తినడం ద్వారా మానసిక తృప్తి కలుగుతుంది. మనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దాని గురించి అందరికీ చెప్పాలి. అప్పుడు, మీరు ఏదైనా ఉదాసీనత ప్రదర్శిస్తే, మీ లక్ష్యం గురించి ఇతరుల ప్రశ్నార్థకపు చూపులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. తద్వారా, మనసు లక్ష్యంపై లగ్నమవుతుంది. ఇలాంటి మానసిక పరమైన అంశాలు కూడా బరువు తగ్గడంలో తోడ్పడతాయి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment