Video Of Day

Breaking News

ఇప్పుడంతా ఆమెను గోల్డెన్ లెగ్ అంటున్నారంట

hamsanandhini-goldenleg
'ప్రతిదినం నీ దర్శనం.. దొరకునా.. దొరకునా' అంటూ వంశీ సినిమా ‘అనుమానాస్పదం’తో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన హంసానందినికి ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. కానీ, ఆ తర్వాత మిర్చి.. మిర్చి.. మిర్చీ లాంటి కుర్రాడే.. అంటూ తన అందాలతో అలరించిన ప్రభాస్ ‘మిర్చి’, పవర్ స్టార్ ‘అత్తారింటికి దారేది’, ‘లెజెండ్’ చిత్రాల్లో ఈ బ్యూటీ చేసిన అతిథి పాత్రలు, ప్రత్యేక పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన ‘లౌక్యం’లో హంస అతిథి పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకోవడంతో అందరూ ఆమెను గోల్డెన్ లెగ్ అంటున్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది. ‘రుద్రమదేవి’లో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నానని, ఇది పూర్తిగా నటనకు అవకాశం ఉన్న పాత్ర అని హంసా నందిని తెలిపారు. ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయి కథానాయిక పాత్రలొచ్చినప్పటికీ, కథలు బాగా లేకపోవడంవల్ల అంగీకరించలేదని ఆమె తెలిపారు.

No comments