జయలలిత కథతో సినిమా

jayalalitha-story-cinema
అక్రమ ఆస్తుల కేసులో దోషిగా జైలు జీవితం అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ వెండితెరకెక్కుతోంది. నటిగా చలన చిత్ర పరిశ్రమలోను, ముఖ్యమంత్రిగా రాజకీయాల్లోనూ విప్లవ నాయకురాలిగా చరిత్ర సృష్టించిన జయలలిత జీవితం సంచలనాలమయం. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ‘అమ్మ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. జయలలితగా ప్రముఖ కన్నడ నటి రాగిణీ ద్వివేది నటిస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన ఫైజల్ సైఫ్ ఇటీవల ‘మై హూ రజనీకాంత్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తన ఇమేజ్‌కు భంగం కలిగించేదిగా ఉందంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ చిత్రం విడుదలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఇప్పుడు జయలలిత జీవిత చరిత్రతో సినిమా తీస్తున్నారు కాబట్టి... కచ్చితంగా వివాదాలు ఎదురవుతాయని అందరూ అనుకుంటున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment