సత్యార్థికి ముందు నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు ఎవరు?

kailash-nobel-prize-winner
నోబెల్ బహుమతి అందుకున్న ఏడో భారతీయుడిగా కైలాస్ సత్యార్థి నిలిచారు. మానవ హక్కులను కాపాడటం కోసం ఆయన చేసిన కృషికి బహుమతి దక్కింది. పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్ జాయ్ తో పాటు సత్యార్థికి శాంతి నోబెల్ బహుమతిని ప్రకటించారు. సత్యార్థికి ముందు ఆరుగురు భారతీయులు ఈ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించారు. వారి వివరాలు..
నోబెల్ పొందిన భారతీయులు:
రవీంద్ర నాథ్ ఠాగూర్ -సాహిత్యం 1913
సీవీ రామన్-భౌతిక శాస్త్రం 1930
హర్ గోవింద్ ఖురానా-వైద్యం 1968
మదర్ థెరిసా-శాంతి బహుమతి 1979
సుబ్రమణ్యం చంద్రశేఖర్- భౌతికశాస్త్రం 1983
అమర్థ్యసేన్-ఆర్థికశాస్త్రం 1998
కైలాస్ సత్యార్థి- శాంతి 2014
భారత సంతతికి చెందిన వారు, భారత్ లో జన్మించి విదేశాలకు వెళ్లిన మరికొందరు ప్రముఖులు కూడా నోబెల్ బహుమతి అందుకున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment