ఆమెకు మధురానుభూతులు కలిగాయంట!

kamilini-appreciate-krishnavamsi
ఆనంద్, గమ్యం, గోదావరి వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెంగాలీ భామ కమలినీ ముఖర్జీ దర్శకుడు కృష్ణవంశీని పొగడ్తలతో ఆకాశానికెత్తారు. కమలినీ  తాజాగా 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో నటించింది. ఇటువంటి కుటుంబ కథా చిత్రంలో నటించినందుకు గర్వపడ్తున్నాననీ కమలినీ ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో నటించడం ద్వారా గొప్ప అనుభూతి పొందినట్లు పేర్కొన్నారు. కుటుంబ సంబంధాలు, మనుషులలో భావోద్వేగాలు, వారి మనస్తత్వాలు తెలియజేయడంలో  కృష్ణవంశీ దిట్ట అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులందరూ ఓ కుటుంబంలా కలిసిమెలిసి పనిచేసినట్లు చెప్పారు. తన కెరీర్ లో దీర్ఘ కాలం 8 నెలలు షూటింగ్ చేసిన చిత్రం ఇదేనన్నారు. షూటింగ్ జరిగినంత కాలం చాలా ఆనందంగా గడిచిపోయినట్లు తెలిపారు. ఈ చిత్రం ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment