మహారాష్ట్రకు నేను ముఖ్యమంత్రిని!


maharashtra_cm_uddhavthackeray

మహారాష్ట్రకు నేను ముఖ్యమంత్రిని అవుతానని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో థాక్రేలు ఎన్నడూ ఎన్నికల్లో పాల్గోన్న దాఖలాలు లేవని, అయితే బాధ్యతలను నిర్వర్తించడంలో తాము ఎప్పుడు వెనుకంజ వేయలేదని ఉద్దవ్ అన్నారు.
 ఓ కామన్ మ్యాన్ నరేంద్రమోడీ దేశానికి ప్రధాని అయ్యారని, నేను కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని అధికార పత్రిక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఓట్ల కోసం ప్రచారాన్ని నిర్వహిస్తున్న కేంద్రమంత్రులు.. ఎన్నికల తర్వాత మహారాష్ట్రను మరిచిపోతారని ఉద్దవ్ విమర్శించారు. అధికార దాహాంతోనే శివసేనతో పొత్తును విచ్చిన్నం చేశారని ఉద్దవ్ థాక్రే ఆరోపించారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment